టీమిండియా ఎట్ సెకెండ్

టీమిండియా ఎట్ సెకెండ్


దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు రెండో స్థానం సాధించింది.  ఐసీసీ మంగళవారం విడుదల చేసిన వార్షిక సవరణ జాబితాలో భారత్ కు రెండో స్థానం దక్కగా, పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, దక్షిణాఫ్రికా మూడో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోగా, ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.



ఈ జాబితాలో 2012-13లో ఆయా జట్లు సాధించిన ఫలితాలను తొలగించగా, 2014-15 వార్షిక సంవత్సరంలో  సాధించిన ఫలితాల ఆధారంగా టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. దీంతో  గతేడాది భారత్ సాధించిన విజయాలు జట్టు ర్యాంకింగ్స్ లో 50 శాతం  ప్రభావం చూపాయి.



టెస్టు రాంకింగ్స్ వివరాలు..



1.ఆస్ట్రేలియా (118 రేటింగ్ పాయింట్లు)



2. భారత్(112 రేటింగ్ పాయింట్లు)



3. పాకిస్తాన్(111 రేటింగ్ పాయింట్లు)



4. ఇంగ్లండ్(105 రేటింగ్ పాయింట్లు)



5. న్యూజిలాండ్(98 రేటింగ్ పాయింట్లు)



6. దక్షిణాఫ్రికా(92 రేటింగ్ పాయింట్లు)



7.శ్రీలంక(88 రేటింగ్ పాయింట్లు)



8.వెస్టిండీస్( 65 రేటింగ్ పాయింట్లు)



9. బంగ్లాదేశ్(57 రేటింగ్ పాయింట్లు)



10. జింబాబ్వే(12 రేటింగ్ పాయింట్లు)



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top