భారత్ ప్రపంచ కప్ ఆశలన్నీ విరాట్పైనే

భారత్ ప్రపంచ కప్ ఆశలన్నీ విరాట్పైనే


సిడ్నీ: టీమిండియా ఎక్కువగా యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై ఆధారపడుతోందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. ప్రపంచ కప్లో విరాట్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం భారత్కు ఎంతో అవసరమని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.



'భారత బ్యాటింగ్ లైనప్ను గమనిస్తే కోహ్లీ ఎంతో విలువైన ఆటగాడు. మధ్య ఓవర్లలో విరాట్తో పాటు రైనా, ధోనీ కీలకం. భారత్ ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకోవాలంటే కోహ్లీ రాణించడం ఎంతో అవసరం. అయితే భారత బౌలింగ్లోని లోపాలు ఆందోళన కలిగించే విషయం. బౌలర్లు మెరుగుపడాల్సిన అవసరముంది' అని ద్రావిడ్ అన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top