క్రికెట్‌ అభిమానులకు షాక్‌..

క్రికెట్‌ అభిమానులకు షాక్‌..

♦ భారీగా పెరగిన వన్డే మ్యాచ్‌ టికెట్‌ ధరలు

♦ టికెట్‌ ధరలపై జీఎస్టీ ఎఫెక్ట్‌..

 

కొల్‌కతా: భారత క్రికెట్‌ అభిమానులకు జీఎస్టీతో గట్టి దెబ్బ తగిలింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో వన్డేమ్యాచ్‌ టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే నెల భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే 5 వన్డేల సీరిస్‌పై ఈ ప్రభావం పడనుంది. ఇ‍క రూ.1300 టికెట్‌ ధర జీఎస్టీ ప్రభావంతో ఒక్కసారిగా రూ.1900 పెరిగింది. వెయ్యి టికెట్‌ రూ.1500 అవ్వగా మాములు రూ.500 టికెట్‌ ధర రూ.650 అయింది. 

 

కాగా మ్యాచ్‌ టికెట్‌ ధరలు ఏమి పెరగలేదని, కేవలం జీఎస్టీ మాత్రమే కలిపామని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ సెప్టెంబర్‌ 21న ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతుందని గంగూలీ పేర్కొన్నాడు. నవంబర్‌లో శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్‌ టికెట్లపై జీఎస్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేశాడు. ఒక రోజుకు రూ.100గా ఉండే ఈ టికెట్‌ ధరపై జీఎస్టీ ప్రభావం లేదని తెలిపాడు.

 

స్వదేశంలో భారత్‌ను ఢీకొట్టడం అతిథ్య జట్టైన ఆసీస్‌కు పెద్ద సవాలేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయం నుంచి కోలుకోకపోవడం ఆసీస్‌కు ఇబ్బందికరమైన విషయమని ఈ మాజీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top