ఫైనల్లో భారత్ ‘ఎ’


ఆస్ట్రేలియా ‘ఎ’పై ఘనవిజయం

  నాలుగు దేశాల వన్డే టోర్నీ

 

 డార్విన్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ ఫైనల్‌కు చేరింది. గురువారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనోజ్ తివారి బౌలర్‌గా రాణించి లిస్ట్ ‘ఎ’ క్రికెట్ కెరీర్‌లో తొలిసారిగా ఐదు వికెట్లు (5/34) పడగొట్టాడు.

 

 ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టాయినిస్ (61 బంతుల్లో 58; 9 ఫోర్లు), ఫిలిప్ హ్యూజెస్ (87 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (112 బంతుల్లో 77; 8 ఫోర్లు), కేదార్ జాదవ్ (50 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శామ్సన్ (51 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. ఇక శనివారం భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ల మధ్యే తుదిపోరు జరగనుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top