పాకిస్తాన్ క్రికెట్ కు ఆఫ్రిది అవసరం లేదు!
కరాచీ: పాకిస్తాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఇజాజ్ భట్ మండిపడ్డారు. అసలు ఆఫ్రిదికి జాతీయ జట్టులో ఉండే అర్హత లేదన్నాడు. గతంలో ఆఫ్రిదితో చోటు చేసుకున్న విభేదాల అనంతరం చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న ఇజాజ్ మరోసారి ఆఫ్రిదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ కు జాతీయ స్థాయిలో ఆడటానికి ఆఫ్రిదికి యోగ్యత లేదని తెలిపాడు.
లాహోర్ లోని గఢాఫీ స్టేడియంలో పీసీబీ చైర్మన్ షహర్ యార్ ఖాన్ తో భేటీ అయిన అనంతరం ఇజాజ్ మీడియాతో మాట్లాడాడు. ఇదే మాటను షహర్ తో చెప్పినట్లు తెలిపాడు. అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపాడు. జాతీయ జట్టులో ఉంచాలా?లేదా అనేది సెలెక్టర్ల ఇష్టమని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.