ఐస్‌క్రీమ్ క్యాచ్!
మ్యాక్స్వెలా... మజాకా
లీడ్స్: బౌండరీ దాటి వెళ్లి, మళ్లీ వెనక్కి వచ్చిన క్యాచ్... ఇద్దరు ఫీల్డర్లు కలిసి అందుకున్న ర్యాలీ క్యాచ్లాంటివి ఎన్నో అద్భుతాలు ఇటీవల మీరు ఫీల్డింగ్‌లో చూసే ఉంటారు. కానీ ఇలాంటి క్యాచ్ మాత్రం కచ్చితంగా ఎప్పుడూ చూడలేదు. ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అలాంటి ‘ఐస్‌క్రీమ్’ క్యాచ్‌తో ఆశ్చర్యపరిచాడు. కౌంటీ జట్టు యార్క్‌షైర్, బార్డ్స్లే క్లప్ మధ్య జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఈ ఘటన జరిగింది.
బౌండరీ వద్ద ఉండే ఫీల్డర్లు డ్రింక్స్ తీసుకోవడం క్రికెట్లో సాధారణమే. అయితే అక్కడ ఉన్న మ్యాక్స్‌వెల్ సరదాగా ఐస్‌క్రీమ్ తింటూ నిలబడ్డాడు. ఇంతలో బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్ అతని వైపు వచ్చింది. వెంటనే ఐస్‌క్రీమ్ విసిరేసి అప్రమత్తమైతే అతను మ్యాక్స్‌వెల్ ఎందుకవుతాడు! ఒక చేత్తో ఐస్‌క్రీమ్ పడిపోకుండా అలాగే పట్టుకొని... మరో చేత్తో ఎగురుతూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ముందుగా ఆశ్చర్యపోయిన బ్యాట్స్‌మన్ ఎడ్ క్లేటన్ ఆ తర్వాత తానూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. మ్యాక్స్వెలా...మజాకా!
సంబంధిత వార్తలు