'సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం'
ముంబై : డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడమంటే తనకంతే ఇష్టమని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ వ్యాఖ్యానించాడు. చెత్తబంతులనే కాదు మంచి బంతులను కూడా బాదకుండా సెహ్వాగ్ వదిలేయడని కపిల్ అన్నాడు. ఔట్ స్వింగర్లతో సెహ్వాగ్ ను పరీక్షించడమంటే తనకు సరదా అని ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మాజీ కెప్టెన్ చెప్పాడు.
కపిల్ 1994లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐదేళ్లకు పాక్ తో మ్యాచ్‌లో సెహ్వాగ్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. అయితే ఆ టైమ్‌లో టీమిండియాకు కోచ్ కు కపిల్ దేవ్ వ్యవహరించాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ కు కపిల్ తన ఔట్ స్వింగర్లు సంధించేవాడు. ఆ రోజులను కపిల్ మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. పోటీతత్వాన్ని సెహ్వాగ్ ఎప్పుడూ ఇష్టపడేవాడని కపిల్ దేవ్ కితాబిచ్చాడు. భారత క్రికెట్లో అందరూ స్టార్ ఆటగాళ్లేనని, ప్రత్యేకంగా వారికి కోచ్ అవసరం లేదని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఇటీవల తన నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు