మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశా: స్టీవ్ స్మిత్

మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశా: స్టీవ్ స్మిత్


సిడ్నీ:ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ డానీ విల్లిస్ తో జీవితాన్ని పంచుకోనున్నట్లు స్మిత్ తాజాగా వెల్లడించాడు.  'ఈ రోజు డానీ ముందు ఒక మోకాలిపై కూర్చొని పెళ్లి విషయాన్ని ప్రపోజ్ చేశా. నా అభ్యర్థనకు డానీ ఒప్పుకుంది. ఇక మా నిశ్చితార్ధం అయిపోయినట్లే' అని స్మిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.



ఈ మేరకు తమ ప్రేమ బలపడటానికి కారణాలు స్మిత్ వెల్లడించాడు. 'నేను ఎక్కడికి వెళ్లినా డానీ నా వెంటే ఉన్నట్లు ఉంటుంది. అంతేకాదు నా జీవితంలో డానీ ఇచ్చే సూచనలు నాకు ఉపయోగకరంగా ఉంటాయి. డానీ చాలా నిజాయితీ గల అమ్మాయి. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పడానికి వెనుకాడదు. అది నాకు ఆమెలో నచ్చిన గుణం'అని స్మిత్ తెలిపాడు. ప్రస్తుతం ఈ జోడి న్యూయార్క్ లో గడుపుతోంది. అక్కడే పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు స్మిత్. దానికి డానీ కూడా ఒప్పుకోవడంతో  వారు ఒక్కటి కావడమే ఇక తరువాయి. ఇరవై ఆరో ఒడిలో ఉన్న డాని.. సిడ్నీలోని మెక్వారీ యూనివర్శిటీలో లా చదువుతుంది. 2011-12 బిగ్ బాస్ లీగ్ లో భాగంగా డానితో స్మిత్ ప్రేమలో పడ్డాడు.


 


 


Today I got down on one knee and @dani_willis said YES 🍾💍#engaged


A post shared by Steve Smith (@steve_smith49) on


Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top