హైదరాబాద్ (vs) విజయవాడ


ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కోసం రెండు రాష్ట్ర సంఘాల ప్రయత్నాలు




హైదరాబాద్, విజయవాడ స్పోర్ట్స్: అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తెలుగు నేలపై త్వరలో ప్రపంచ   మహిళల చెస్ చాంపియన్‌షిప్ జరిగే అవకాశం ఉంది. ఈసారి ఈ టోర్నీని ప్రపంచ సమాఖ్య భారత్‌కు కేటాయించింది. దాదాపు రూ.8 కోట్లు ఖర్చయ్యే ఈ టోర్నీని విజయవాడలో నిర్వహించాలని ఏపీ చెస్ సంఘం, హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ చెస్ సంఘం కూడా ప్రయత్నాలు ప్రారంభిం చాయి.





ఈ రెండు సంఘాలు మినహా దేశంలో ప్రస్తుతానికి మరే చెస్ సంఘం ప్రయత్నాలు చేయడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ టోర్నీలో ప్రపంచంలోని 64 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొంటారు. 23 రోజులపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్ ఎక్కడ జరుగుతుందో చూడాలి.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top