యువరాజే నాకు స్ఫూర్తి: ధావన్

యువరాజే నాకు స్ఫూర్తి: ధావన్


 న్యూఢిల్లీ: డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఆటతీరు తనలో స్ఫూర్తినింపిందని భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. ‘యువరాజ్ బంతిని బాదే తీరు చాలా బాగుంటుంది. ఇంకెవరూ అలా ఆడరు. అదే నాకు ప్రేరణగా నిలిచింది. నేను కూడా అలాగే ఆడితే కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలనని భావించాను. ఇక నిలకడైన ఆటతీరు విషయంలో పుజారా నుంచి చాలా నేర్చుకున్నాను. అతడిని అవుట్ చేసేందుకు బౌలర్లు ఎంతగా శ్రమించినా అంత సులువుగా తను వికెట్‌ను చేజార్చుకోడు’ అని ధావన్ అన్నాడు. అయితే తానిప్పుడు విజయవంతమైన క్రికెటర్‌గా కనిపిస్తున్నా.. అపజయాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. చాలామంది ఆటగాళ్లు తమ ఫామ్ గురించి ఆందోళన చెందుతుంటారని, తన వరకైతే పట్టుదలగా ఆడుతూ ఓపిగ్గా ఎదురు చూస్తానన్నాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top