సెమీస్‌లో హారిక హంపి ఆశలు సజీవం

సెమీస్‌లో హారిక  హంపి ఆశలు సజీవం


సోచి (రష్యా): అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హారిక 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌లో 95 ఎత్తుల్లో గెలిచింది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్‌కు చేరుకున్నా ఆ అడ్డంకిని దాటలేకపోయింది.



ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో తప్పనిసరిగా నెగ్గాల్సిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన టాప్ సీడ్ హంపి 62 ఎత్తుల్లో గెలిచింది. దాంతో ఈ ఇద్దరు 1-1తో సమంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఈ పోటీలో నెగ్గిన వారు సెమీఫైనల్లో హారికతో తలపడతారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top