తొలిసారి ఉపఖండంలో

తొలిసారి ఉపఖండంలో


తొలి మూడు ప్రపంచకప్‌లు ఇంగ్లండ్‌లో జరిగిన తర్వాత... నాలుగో ఈవెంట్ 1987లో భారత ఉపఖండంలో జరిగింది. భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఓవర్లను 60 నుంచి 50కి కుదించారు. రిలయన్స్ కప్‌గా ప్రాచుర్యం పొందిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా ఆవిర్భవించింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోనూ ఒక మ్యాచ్ జరిగింది.



న్యూజిలాండ్, జింబాబ్వే ఈ మ్యాచ్ ఆడాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కపిల్ సేనతో పాటు మరో ఆతిథ్య దేశం పాకిస్తాన్ కూడా సెమీస్‌లో ఓడిపోయాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.  

 

ఆతిథ్యం: భారత్, పాకిస్థాన్; వేదికలు: 21

పాల్గొన్న జట్లు (8): భారత్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జింబాబ్వే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top