మొయిన్ ‘మ్యాజిక్’ వెనుక...

మొయిన్ ‘మ్యాజిక్’ వెనుక...


 ‘ప్రపంచానికి మొయిన్ అలీ ఓ మామూలు స్పిన్నర్... కానీ భారత బ్యాట్స్‌మెన్‌కు మురళీధరన్‌లా కనిపిస్తున్నాడు’... ఇంటర్నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్న కామెంట్ ఇది. స్పిన్ బాగా ఆడతారనే పేరున్న భారత్‌పై ఆరు వికెట్లు తీయడం... అది కూడా ఇంగ్లండ్ పిచ్‌పై విశేషమే. మరి మొయిన్ విజయ రహస్యం ఏమిటి?

 

 

 సాక్షి క్రీడావిభాగం

 ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ పర్యటన ద్వారా మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్ సందర్భంగా అతని పేరు వినిపించింది. వెస్టిండీస్ పర్యటనలో ఫర్వాలేదనిపించినా... టి20 ప్రపంచకప్‌లో వూత్రం విఫలవుయ్యూడు.

 

 అరుునా లంకతో టెస్టు సిరీస్‌కు మాత్రం జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా సహచరులకు మద్దతు ఇచ్చే బౌలర్ పాత్ర పోషించాడు. కానీ భారత్‌తో సిరీస్ సమయానికి అనూహ్యంగా జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. గత యాషెస్ సమయంలో గ్రేమ్ స్వాన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్‌కు నాణ్యమైన స్పిన్ బౌలర్ దొరకలేదు.

 

 రకరకాల ప్రత్యామ్నాయాలను చూసినా... అలీని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం భారత్‌తో అతని ప్రదర్శన చూసిన తర్వాత ఇంగ్లండ్‌కు స్పిన్నర్ కొరత తీరిందనే అనుకోవాలి. జడేజా లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ విఫలమైన చోట అలీ అద్భుతమైన ఫ్లయిట్, బౌన్స్, టర్న్ రాబట్టాడు. ఇప్పటివరకు అలీ కెరీర్‌లో ఆడింది 5 టెస్టులు, 3 వన్డేలు, 6 టి20లు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి తీసింది 21 వికెట్లు. ఈ గణాంకాల ఆధారంగా అతణ్ని గొప్ప స్పిన్నర్‌గా  లెక్కకట్టడం కాస్త తొందరపాటే. అయితే ఇంగ్లండ్‌కు మాత్రం అతనిలో స్వాన్ కనిపిస్తున్నాడు. అలీ ఆ అంచనాలను అందుకుంటే మాత్రం గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు.

 

 అజ్మల్ దగ్గర దూస్రాలు...

 పాకిస్థాన్ సంతతికి చెందిన మొయిన్ అలీ బర్మింగ్‌హామ్‌లో జన్మించాడు. అతని సోదరుడు ఖాదీర్ అలీ స్ఫూర్తితో క్రికెట్‌లో అడుగుపెట్టిన అలీ... ఇంగ్లండ్‌లోని చాలామంది లాగే రకరకాల కౌంటీ డివిజన్లలో మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతని కెరీర్ మలుపు తిరిగింది 2011లో. ఆ సీజన్‌లో వర్సెస్టర్‌షైర్ తరఫున పాక్ స్పిన్నర్ అజ్మల్‌తో కలిసి ఆడటం అలీని బౌలర్‌గా బాగా ఎదిగేలా చేసింది. అజ్మల్ దగ్గర దూస్రాలు నేర్చుకున్నాడు. బంతిలో వేగాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాడు. వీటిని ఇంగ్లండ్ కౌంటీల్లో ప్రదర్శించి విజయం సాధించాడు. అంతే... 13 మంది సభ్యుల ఇంగ్లండ్ డెవలెప్‌మెంట్ జట్టులోకి వచ్చేశాడు. రెండేళ్లలోనే నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగి ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి వచ్చాడు.

 

 ‘బ్యాండ్’ వివాదం...

 భారత్‌తో మూడో టెస్టులో తన చేతికి ‘సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా’ అనే రిస్ట్‌బ్యాండ్‌లను ధరించి వివాదాల్లోకీ వచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ రాజకీయు, వుతపరమైన, జాతి కార్యకలాపాలు ప్రదర్శించకూడదు. దీంతో ఐసీసీ మొయిన్‌ను హెచ్చరించింది. కానీ ఈ విషయుంలో ఈసీబీ మొరుున్ అలీని సవుర్థించడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top