మోకాళ్ల నొప్పితోనూ వీరోచిత సెంచరీ

మోకాళ్ల నొప్పితోనూ వీరోచిత సెంచరీ


సౌతాంప్టన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ శతకం సాధించాడు. మోకాళ్ల నొప్పులు లాంటి సమస్యలు వేధిస్తున్నా.. జట్టు కోసం పోరాడి శతకం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 77 బంతుల్లో 11 ఫోర్లు,  3 సిక్సర్లతో శతకం చేసిన స్టోక్స్(101) సఫారీ బౌలర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్టోక్స్ సెంచరీ, బట్లర్ అజేయ్ హాఫ్ సెంచరీ(53 బంతుల్లో 65: 7ఫోర్లు)తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది.



బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన జాసన్ రాయ్ రబాడా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ హేల్స్ (24), జో రూట్(39) పరుగులు చేశారు. బట్లర్ తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించాక స్టోక్స్ ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (19 బంతుల్లో 33 పరుగులు: 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి అలీ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికాకు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top