గెలిచాం ఓడిపోయాం

గెలిచాం ఓడిపోయాం


ఒక్క పరుగుతో ఓడిన ధోనిసేన

ఉత్కంఠ పోరులో విండీస్ విజయం

రాహుల్ అమోఘ శతకం వృథా

సెంచరీతో చెలరేగిన లూరుుస్ 


లక్ష్యం: 20 ఓవర్లలో 246 పరుగులు.  భారత్: 19.5 ఓవర్లలో 244/3  ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో సంచలన విజయాలు అందించిన ధోని 1 బంతికి 2 పరు గులు చేయలేడా..? ఇక భారత్ విజయం లాంఛనమే. టి20 క్రికెట్‌లో ఏ జట్టూ ఛేదించనంత భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ విజయం సాధించబోతోంది..!



డ్వేన్ బ్రేవో... టి20 క్రికెట్‌లో ఢక్కాముక్కీలు తిన్న బౌలర్. వెంటనే బంతి వేస్తే ఆ జోరులో ధోని బాదేస్తాడు. అందుకే తాత్సారం చేశాడు. ఫీల్డర్లను అటూ ఇటూ మార్చాడు... అరుుతేనేం... ఎదురుగా ఉందెవరు..? ధోని. భారత్ చరిత్ర సృష్టించకుండా ఆపడం ఎవరి తరమూ కాదు... భారత అభిమానుల్లో ధీమా



బ్రేవో బంతి వేశాడు. ధోని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా స్లైస్ షాట్ ఆడాడు. ఆ ఫీల్డర్‌ని తప్పిస్తే చాలు. ఫోర్ ఖాయం. ధోని ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అలా వెళ్లి శామ్యూల్స్ చేతిలో పడింది. అప్పటిదాకా చిందులు వేసిన భారత అభిమానులకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. భారత్ ఓడిపోరుుంది. నిజం... జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా... గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోరుుంది.


లాడర్‌హిల్ (ఫ్లోరిడా): 40 ఓవర్లలో 489 పరుగులు... వినడానికి ఆశ్చ ర్యంగా ఉన్నా ఇది నిజం. భారత్, వెస్టిండీస్ కలిసి అమెరికా ప్రేక్షకులకు టి20 క్రికెట్‌లో అసలు వినోదం ఎలా ఉంటుందో చూపించారుు. కొడితే ఫోర్... లేదంటే సిక్సర్... ఒకరిని మించి మరొకరు... ఒకరిని మరపిస్తూ ఇంకొకరు... బౌండరీల వర్షంతో, సిక్సర్ల సునామీతో అమెరికాను అలరించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ఓడిపోరుునా... టి20 చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ ఇది.


 రెండు టి20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి టి20లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 244 పరుగులు మాత్రమే చేసింది. విజయానికి చివరి బంతికి  రెండు పరుగులు అవసరం కాగా... ధోని అవుట్ కావడంతో భారత్ తీవ్రంగా నిరాశచెందింది.  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ పరుగుల వరద పారిచింది. ఓపెనర్ ఎవిన్ లూరుుస్ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంస ఆటతీరుతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు చేసింది.


మరో ఓపెనర్ చార్లెస్ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వేగంగా ఆడాడు. బుమ్రా, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కారుు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 244 పరుగులు చేసి ఓడింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీ వృథా అరుు్యంది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... ధోని (25 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాగానే ఆడినా ఆఖరి బంతికి నిరాశపరిచాడు.. బ్రేవోకు రెండు వికెట్లు దక్కారుు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లూరుుస్‌కి దక్కింది.


తుఫానే చిన్నబోయేలా..: క్రిస్‌గేల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో లూరుుస్... చార్లెస్‌తో కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్‌‌సను ప్రారంభించాడు.  ఈ ఇద్దరూ మెరుపు వేగంతో ఆడటంతో విండీస్ 25 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. మరుసటి ఓవర్‌లో చార్లెస్ వరుసగా రెండు సిక్సర్లతో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లేలోనే 78 పరుగులు వచ్చారుు. భారత్ గతంలో ఇన్ని పరుగులు ఏ జట్టుకూ ఇవ్వలేదు. జడేజా ఓవర్‌లో లూరుుస్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో పరుగులప్రవాహం పెరిగింది. బంతి పడిందే ఆలస్యం బౌండరీ ఆవల ఉండడంతో 8వ ఓవర్‌లోనే విండీస్ వంద పరుగుల మార్కును దాటింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో చార్లెస్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగులు రాబట్టాడు. అరుుతే షమీ ఈ జోరుకు అడ్డుకట్ట వేశాడు.


పదో ఓవర్‌లో తన యార్కర్‌కు చార్లెస్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 126 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌లో లూరుుస్ ఓ బౌండరీ సహాయంతో 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చార్లెస్ అనంతరం లూరుుస్ విధ్వంస బాధ్యతను తీసుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ 48 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. అటు 15.1 ఓవర్‌లోనే విండీస్ స్కోరు 200 పరుగులకు చేరింది. అరుుతే ఇదే ఓవర్‌లో రస్సెల్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), జోరు మీదున్న లూరుుస్‌లను జడేజా పెవిలియన్‌కు పంపడంతో భారత్ కాస్త కోలుకుంది. రెండో వికెట్‌కు వీరు 78 పరుగులు సమకూర్చారు. చివర్లో భారత బౌలర్లు  నియంత్రించడంతో స్కోరు 250కి చేరకుండా ఆగింది. 


తడబడినా.. పోరాటం: భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే ఇబ్బంది పడింది. ఓ ఎండ్‌లో రోహిత్ నిలకడగా ఆడినా...  రహానే, కోహ్లి నిరాశపరచడంతో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోరుుంది. అరుుతే ఆ తర్వాత వచ్చిన రాహుల్ ధాటిగా ఆడాడు. ఆరో ఓవర్‌లో 4,6,4తో పాటు ఆ తర్వాత ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది స్కోరును పెంచాడు. మరో ఎండ్‌లో రోహిత్ విండీస్ బౌలర్లను ధాటిగాఎదుర్కొంటూ 22 బంతుల్లో ఓ భారీ సిక్స్‌తో అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ ఓ ఫోర్‌తో 26 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. అరుుతే వీరిద్దరి జోడి ప్రమాదకరంగా మారుతున్న దశలో పొలార్డ్ దెబ్బతీశాడు. డీప్ మిడ్ వికెట్‌లో చార్లెస్‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు వీరు 89 పరుగులు జోడించారు.


నరైన్ వేసిన 14వ ఓవర్‌లో సిక్స్, ఫోర్, ఫోర్‌తో రెచ్చిపోరుున రాహుల్ ఆ తర్వాత మరో సిక్స్, ఫోర్ రాబట్టడంతో పరుగుల వేగం పెరిగింది. ఇక 24 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన దశలో ధోని రెండు సిక్సర్లు, రాహుల్ మరో సిక్స్‌తో వ్యత్యాసం తగ్గించారు. ఇదే జోరుతో రాహుల్ 46 బంతుల్లోనే తొలి శతకం సాధించాడు. ఇక చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా బ్రేవో కట్టడి చేశాడు. తొలి బంతికి ధోని ఇచ్చిన క్యాచ్‌ను శామ్యూల్స్ వదిలేసినా  చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో ధోని ఇచ్చిన క్యాచ్‌ను తిరిగి తనే పట్టి భారత్‌కు షాక్ ఇచ్చాడు.


5 బంతుల్లో 5 సిక్సర్లు

స్టువర్ట్ బిన్నీ వేసిన 11వ ఓవర్‌లో ఎవిన్ లూరుుస్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది విధ్వంసమే సృష్టిం చాడు. తొలి బంతిని తేలిగ్గా మిడ్ వికెట్ వైపు సిక్స్ బాదిన తను రెండో బంతిని వికెట్‌కీపర్ వెనకాలకు పంపాడు. మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత ఫుల్ టాస్ వేయగా ఓవర్ లాంగ్ ఆఫ్‌లో బయటికి పంపాడు. నాలుగో బంతిని కవర్ మీదుగా ఐదో బంతిని డీప్ ఫైన్ లెగ్ వైపు సిక్సర్‌గా పంపడంతో మొత్తం 32 పరుగులు వచ్చారుు.


స్కోరు వివరాలు

వెస్టిండీస్ ఇన్నింగ్‌‌స:
చార్లెస్ (బి) షమీ 79; ఎవిన్ లూరుుస్ (సి) అశ్విన్ (బి) జడేజా 100; రస్సెల్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 22; పొలార్డ్ (బి) బుమ్రా 22;  బ్రాత్‌వైట్ (రనౌట్) 14; డ్వేన్ బ్రేవో నాటౌట్ 1; సిమ్మన్‌‌స (బి) బుమ్రా 0; శామ్యూల్స్ నాటౌట్ 1;


 ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245.


 వికెట్ల పతనం: 1-126, 2-204, 3-205, 4-236, 5-244, 6-244.


 బౌలింగ్: షమీ 4-0-48-1; భువనేశ్వర్ 4-0-43-0; బుమ్రా 4-0-47-2; అశ్విన్ 4-0-36-0; జడేజా 3-0-39-2; బిన్నీ 1-0-32-0.


 భారత్ ఇన్నింగ్‌‌స: రోహిత్ (సి) చార్లెస్ (బి) పొలార్డ్ 62; రహానే (సి) బ్రావో (బి) రస్సెల్ 7; కోహ్లి (సి) ఫ్లెచర్ (బి) బ్రేవో 16; రాహుల్ నాటౌట్ 110; ధోని (సి) శామ్యూల్స్ (బి) బ్రేవో 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 244.


 వికెట్ల పతనం: 1-31, 2-48, 3-137, 4-244. బౌలింగ్: రస్సెల్ 4-0-53-1; బద్రీ 2-0-25-0; డ్వేన్ బ్రేవో 4-0-37-2; నరైన్ 3-0-50-0; బ్రాత్‌వైట్ 4-0-47-0; పొలార్డ్ 3-0-30-1.


1 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.

3   భారత్ తరఫున టి20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. ఇంతకుముందు రోహిత్ శర్మ, రైనా ఒక్కో సెంచరీ చేశారు.

244 అంతర్జాతీయ టి20ల్లో రెండో ఇన్నింగ్‌‌సలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్.

7   టి20ల్లో ఒకే ఇన్నింగ్‌‌సలో 200 పరుగులు సమర్పించుకోవడం భారత్‌కిది ఏడోసారి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top