ఒక్క విజయంతో సంచలనం

ఒక్క విజయంతో సంచలనం


లండన్: డస్టిన్ బ్రౌన్... ఈ పేరు నిన్నటి వరకు ఎవరికీ తెలియదు. ఒకే ఒక్క విజయంతో అతడి పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది. 30 ఏళ్ల ఈ జర్మన్ టెన్నిస్ ప్లేయర్ వింబుల్డన్ లో సంచలనం సృష్టించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 102వ ర్యాంకులో కొనసాగుతున్న బ్రౌన్.. మాజీ నంబర్ వన్ ఆటగాడు, రెండుసార్లు వింబుల్డన్ విజేత అయిన స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ ను రెండో రౌండ్ లోనే మట్టికరిపించాడు. 7-5, 3-6, 6-4, 6-4 తేడాతో ఓడించి ఔరా అనిపించాడు.



రెండో సెట్ కోల్పోయిన బ్రౌన్ తర్వాత అసమాన ఆటతీరుతో నాదల్ ను ఇంటిముఖం పట్టించాడు. 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్ ను రెండో రౌండ్ లోనే ఓడించిన బ్రౌన్ ఒకప్పుడు డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. తన కాంపర్ వ్యానులోనే ప్రయాణించి టోర్నమెంట్లలో పాల్గొనేవాడు. మూడు బెడ్ లు, బాత్రూములు ఉన్న ఈ వ్యాన్ లోనే యూరప్ అంతా తిరిగి టోర్నమెంట్లు ఆడాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా టెన్నిస్ మాత్రం విడిచి పెట్టలేదు. తాజా సంచలనంతో అతడి కష్టానికి గుర్తింపు లభించినట్టైంది.



వెరైటీ హెయిర్ స్టైల్

రాఫెల్ నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించిన డస్టిన్ బ్రౌన్ తన హెయిర్ స్టైల్ తోనూ ప్రత్యేక చాటుకున్నాడు. పొడపాటి జుత్తును సన్నని జాడలు మాదిరిగా పెంచి ముడేసి వుంచాడు. అతడు ఆడుతున్నప్పుడు జులపాలు పైకి, కిందకు ఎగురుతూ వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆటతోనే కాదు హెయిర్ స్టైల్ తోనూ బ్రౌన్ స్పెషల్ గా నిలిచాడు.



Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top