ఐపీఎల్ తో బంధం ముగియనుందా?

ఐపీఎల్ తో బంధం ముగియనుందా?


న్యూఢిల్లీ:ఇటీవల పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి  భారత 'ఎ', అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వివరణ కోరిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఉన్న ద్రవిడ్.. కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ పై కొన్ని రోజుల క్రితం బీసీసీఐ లేఖ రాశాడు. బీసీసీఐతో తనకు పది నెలల ఒప్పందం ఉంది కాబట్టి విరుద్ధ ప్రయోజనాల అంశంపై ద్రవిడ్ స్పష్టత కోరాడు. తనను విమర్శించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌పై క్లారిటీ ఇవ్వాలని అడిగాడు.



అయితే తాజాగా బీసీసీఐతో 12 నెలల సుదీర్ఘ కాంట్రాక్ట్ కు  ద్రవిడ్ రెండేళ్ల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రిని ద్రవిడ్ ఆదివారం సాయంత్రం కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ పదవిని వదులుకోవడాని ద్రవిడ్ అంగీకరించినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం 12 నెలల మొత్తం కాలం బీసీసీఐతోనే ఉండాల్సి వస్తుంది. దాంతో ఐపీఎల్ వంటి లీగ్ ల్లో ద్రవిడ్ దూరంగా ఉండకతప్పదు. గతంలో ద్రవిడ్ కు బీసీసీఐతో ఏడాదిలో 10 నెలల పాటు ఒప్పందం మాత్రమే ఉండేది.  దాంతో మిగతా రెండు నెలల  కాలంలో ఐపీఎల్లో ఒక జట్టుకు ద్రవిడ్ మెంటర్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఒకవేళ బీసీసీఐతో 12 నెలల ఒప్పందం అనేది నిజమైతే ద్రవిడ్ కు ఐపీఎల్ కు బంధం ముగిసినట్లే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top