Alexa
YSR
‘ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ నిర్మించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

చాంపియన్‌ తమిళనాడు

Sakshi | Updated: March 21, 2017 00:19 (IST)
చాంపియన్‌ తమిళనాడు

న్యూఢిల్లీ: తొలుత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ (120 బంతుల్లో 112; 14 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించడం... ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు విజేతగా అవతరించింది. బెంగాల్‌ జట్టుతో సోమవారం ఇక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 37 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తమిళనాడు. 47.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.

 బాబా ఇంద్రజిత్‌ (32)తో కలిసి దినేశ్‌ కార్తీక్‌ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. బెంగాల్‌ బౌలర్లలో మొహమ్మద్‌ షమీ (4/26), అశోక్‌ దిండా (3/36) ఆకట్టుకున్నారు. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్‌ జట్టు 46.5 ఓవరల్లో 180 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. సుదీప్‌ చటర్జీ (58; 5 ఫోర్లు), మనోజ్‌ తివారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

తమిళనాడు బౌలర్లలో అశ్విన్‌ క్రిస్ట్, మొహమ్మద్, రాహిల్‌ షా రెండేసి వికెట్లు తీయగా... సాయికిశోర్, బాబా అపరాజిత్, విజయ్‌ శంకర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 2002లో విజయ్‌ హజారే టోర్నీలో లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతి మొదలయ్యాక తమిళనాడు టైటిల్‌ నెగ్గడం ఇది ఐదోసారి కావడం విశేషం. 2009–10 సీజన్‌ తర్వాత ఈ టోర్నీలో తమిళనాడు మళ్లీ విజేతగా నిలిచింది. మరోవైపు బెంగాల్‌ జట్టు ఫైనల్‌కు చేరుకున్న నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవడం గమనార్హం.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

దేశమంతా ఒకసారే..

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC