ఆ చిరునవ్వే నా ‘జీవం!


బెంగళూరు : బోసి నవ్వులు, ఆటలు, అప్పుడప్పుడు చిన్నపాటి ఏడుపు, లాలింత...మైదానం బయట ఇప్పుడు ఇదే ధోని ప్రపంచం. నాయకుడిగా భారత క్రికెట్‌ను నడిపిస్తున్న మహి, తండ్రిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా తన కూతురు ‘జీవా’ ముచ్చట్లే. ఆమె పుట్టినప్పడు ఆస్ట్రేలియాలో ఉన్న ధోని, తిరిగి వచ్చా క ఒక్క క్షణం కూడా వీడి ఉండటం లేదు. చిన్నారి రాకతో తన జీవితం మారిపోయిందని అతను చెబుతున్నాడు. ‘పిల్లలు పుట్టాక మనందరిలో ఎంతో మార్పు వస్తుంది.



మీ వంక చూస్తూ ఆ చిన్నారి పంచే చిరునవ్వుతో జీవితం కొత్తగా అనిపిస్తుంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. జీవా పుట్టాక చాలా రోజుల పాటు తాను చూడలేదని, ఆస్ట్రేలియాలో ఆ రోజులు భారంగా గడిచాయని గుర్తు చేసుకున్న మహి, ఆ పాప గురించి ఉద్వేగంగా మాట్లాడాడు. ‘నేను నా దేశం తరఫున ఆడుతున్నానా, చెన్నైలాంటి మంచి ఫ్రాంచైజీకి ఆడుతున్నానా అనేది జీవా పట్టించుకోదు. తనకు ఏడుపు వస్తే ఏడ్చేస్తుందంతే. అదో గొప్ప అనుభూతి’ అని ధోని చెప్పుకొచ్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top