భారత్‌ ‘బి’ గెలుపు


సాక్షి, విశాఖపట్నం: తొలుత శిఖర్‌ ధావన్‌ (122 బంతుల్లో 128; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ... ఆ తర్వాత ధవల్‌ కులకర్ణి ‘హ్యాట్రిక్‌’ సాధించడంతో... దేవధర్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో పార్థివ్‌ పటేల్‌ నాయకత్వంలోని భారత్‌ ‘బి’ జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్‌ ‘బి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం భారత్‌ ‘ఎ’ జట్టు 48.2 ఓవర్లలో 304 పరుగులు చేసి పోరాడి ఓడింది. అంబటి రాయుడు (92 బంతుల్లో 92; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత్‌ ‘బి’ బౌలర్‌ ధవల్‌ కులకర్ణి 47వ ఓవర్‌ ఆఖరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ను... 49వ ఓవర్‌ తొలి బంతికి దీపక్‌ హుడాను, రెండో బంతికి సిద్ధార్థ్‌ కౌల్‌ను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్‌ ‘బి’తో తమిళనాడు తలపడుతుంది.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top