డుమిని దమాకా

డుమిని   దమాకా


ఢిల్లీ డేర్‌డెవిల్స్ బోణి

 నైట్‌రైడర్స్‌పై 4 వికెట్లతో గెలుపు

 రాణించిన దినేశ్ కార్తీక్

 

 దుబాయ్: ఐపీఎల్  ఏడో సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఖాతా తెరిచింది. దినేశ్ కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డుమిని సూపర్ బ్యాటింగ్ (35 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కారణంగా ఢిల్లీ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే (42 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించారు. ఆ తర్వాత ఢిల్లీ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.  

 

 ఉతప్ప జోరు...

 ఓపెనర్లు గంభీర్, కలిస్ ఖాతా తెరువకుండానే వెనుదిరగడంతో కోల్‌కతా బ్యాటింగ్ నిదానంగా కొనసాగింది. పాండే, ఉతప్ప సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 

 ఫామ్‌లో ఉన్న మనీష్ పాండే క్రీజ్‌లో నిలదొక్కుకున్నాక ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇక 7 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర టేలర్ క్యాచ్ జారవిడవడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఉతప్ప తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు.  

 

 

 ఇక జోరుమీదున్న ఉతప్ప... ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌తో కలిసి మరో కీలకమైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఉతప్ప... కాసేపటికే వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌కు షకీబ్‌తో కలిసి 57 పరుగులు జోడించాడు. చివర్లో షకీబ్, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ ధాటిగా ఆడటంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది.  

 

 తడబాటుతో మొదలైనా

 తొలి ఓవర్‌లోనే మురళీ విజయ్ (0) వికెట్ చేజార్చుకున్నా... ఆరంభం నుంచే ఢిల్లీ స్పీడ్‌గా ఆడింది. మయాంక్ అగర్వాల్ (26) ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో 49 పరుగులు వచ్చాయి. టేలర్ అవుటయ్యాక కార్తీక్‌కు డుమిని జత కలిశాడు. ఇద్దరూ కలిసి 13వ ఓవర్‌లో వంద పరుగులు దాటించారు. స్కోరు పెంచే ప్రయత్నంలో నరైన్‌కు కార్తీక్ వికెట్ల ముందు చిక్కాడు.

 

 కాసేపటికే మనోజ్ తివారీ, నీషమ్ అవుటైనా... డుమిని సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు.

 

 స్కోరు వివరాలు

 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: కలిస్ (సి) టేలర్ (బి) షమీ 0; గంభీర్ (సి) డుమిని (బి) నైల్ 0; పాండే (బి) నదీమ్ 48; ఉతప్ప (సి) టేలర్ (బి) ఉనాద్కట్ 55; షకీబ్ నాటౌట్ 30; యూసుఫ్ పఠాన్ (బి) నైల్ 11; సూర్య కుమార్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 14 : మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 166

 వికెట్ల పతనం: 1-1; 2-11; 3-75; 4-132; 5-157.

 బౌలింగ్: షమీ 4-0-33-1; నైల్ 4-0-27-2; ఉనాద్కట్ 4-0-25-1; నీషమ్ 2-0-26-0; నదీమ్ 3-0-29-1; డుమిని 3-0-25-0.

 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 0; మయాంక్ (సి) చావ్లా (బి) మోర్నీ మోర్కెల్ 26; దినేశ్ కార్తీక్ ఎల్‌బిడబ్ల్యు (బి) నరైన్ 56; టేలర్ (బి) కలిస్ 6; డుమిని నాటౌట్ 52; మనోజ్ తివారీ (సి) నరైన్ (బి) మోర్నీ మోర్కెల్ 8; నీషమ్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) చావ్లా 8; నైల్ నాటౌట్ 0 ; ఎక్స్‌ట్రాలు 11 : మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 167

 వికెట్ల పతనం: 1-10; 2-39; 3-60; 4-118; 5-127; 6-161.




 బౌలింగ్: వినయ్ 4-0-35-0; మోర్నీ మోర్కెల్ 4-0-41-2; షకీబ్ 3-0-25-0; కలిస్ 2-0-15-1; చావ్లా 2.3-0-27-1; నరైన్ 4-0-18-1.

 

 ఐపీఎల్‌లో నేడు

 రాజస్థాన్ రాయల్స్

 X

 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్

 వేదిక: దుబాయ్

 రా. గం. 8.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top