ఢిల్లీ ధమాకా

ఢిల్లీ ధమాకా


పంజాబ్‌పై అలవోక గెలుపు    

 మయాంక్, శ్రేయస్ అర్ధసెంచరీలు

 కోల్టర్‌నీల్‌కు 4 వికెట్లు  

 ఆకట్టుకున్న జహీర్ ఖాన్


 

 న్యూఢిల్లీ: గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న జహీర్ ఖాన్ (2/17) ఘనమైన పునరాగమనానికి తోడు కోల్టర్‌నీల్ (4/20) సంచలన బౌలింగ్ చేయడంతో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ అదరగొట్టింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (40 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

 

  శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో... ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. మిల్లర్ (41 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (26 బంతుల్లో 22; 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత ఢిల్లీ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి నెగ్గింది. కోల్టర్‌నీల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

 

 టాప్ కకావికలం..

 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ టాప్ ఆర్డర్‌ను ఢిల్లీ బౌలర్లు జహీర్, కోల్టర్‌నీల్, డుమినిలు వణికించారు. ఇన్నింగ్స్ రెండో బంతికి సెహ్వాగ్ (1)ను, తర్వాత వరుస ఓవర్లలో మార్ష్ (5), వోహ్రా (1), సాహా (3)లు అవుట్ కావడంతో పంజాబ్ 10 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఐదో వికెట్‌కు 27 పరుగులు జోడించాక బెయిలీ, కొద్దిసేపటికే పెరీరా (3)లు వెనుదిరిగడంతో పంజాబ్ 45 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కోలుకోలేకపోయింది. లక్ష్యం చిన్నది కావడంతో ఢిల్లీ ఓపెనర్లు మయాంక్, శ్రేయస్‌లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు.

 

 రెండో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు సాధించి శ్రేయస్ దూకుడును చూపెట్టగా, సందీప్ ఓవర్‌లో మయాంక్ భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఇదే జోరును కొన సాగిస్తూ ఢిల్లీ విజయతీరాలకు చేరింది. క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు లావెండర్ రంగు జెర్సీలతో బరిలోకి దిగారు.

 

 స్కోరు వివరాలు

 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్(సి) మ్యాథ్యూస్ (బి) జహీర్ 1; వోహ్రా (సి) జాదవ్ (బి) జహీర్ 1; మార్ష్ ఎల్బీడబ్ల్యు (బి) డుమిని 5; సాహా (సి) జాదవ్ (బి) కోల్టర్‌నీల్ 3; మిల్లర్ (సి) తివారీ (బి) కోల్టర్‌నీల్ 42; బెయిలీ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 18; పెరీరా (సి) తివారీ (బి) కోల్టర్‌నీల్ 3; అక్షర్ (సి) మయాంక్ (బి) కోల్టర్‌నీల్ 22; ఠాకూర్ నాటౌట్ 7; అనురీత్ సింగ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-1; 2-6; 3-10; 4-10; 5-37; 6-45; 7-102; 8-104.; బౌలింగ్: జహీర్ 4-0-17-2; డుమిని 4-0-15-1; కోల్టర్‌నీల్ 4-0-20-4; మిశ్రా 2-0-10-1; మ్యాథ్యూస్ 3-0-19-0; తాహిర్ 3-0-36-0.

 

 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ నాటౌట్ 52; శ్రేయస్ అయ్యర్ (సి) అక్షర్ (బి) ఠాకూర్ 54; సౌరభ్ తివారీ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119.

 

 వికెట్ల పతనం: 1-106.

 బౌలింగ్: సందీప్ శర్మ 3-0-10-0; శార్దూల్ ఠాకూర్ 3-0-38-1; అనురీత్ 3-0-24-0; పెరీరా 2-0-22-0; అక్షర్  పటేల్ 2.5-0-23-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top