గంగూలీ ఎంపిక ఖరారు కాలేదు!

గంగూలీ ఎంపిక ఖరారు కాలేదు!


జూన్ 6 లోగా కోచ్ నియామకం

 చాంపియన్స్ లీగ్‌ను మెరుగుపరుస్తాం

 అనురాగ్ ఠాకూర్ వెల్లడి


 కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఎంపికపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపికపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నామని ఆయన చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో కలిసి ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. సలహా సంఘం చైర్మన్‌గా గానీ, జట్టు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్‌గా గానీ లేదా టీమ్ డెరైక్టర్, చీఫ్ కోచ్‌గా గానీ గంగూలీని ఎంపిక చేయనున్నట్లు కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ‘సౌరవ్ ఎంపికపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆటగాడిగా అతని గొప్పతనం గురించి అందరికీ తెలుసు. అయితే కోచ్ విషయంలో మాత్రం కాస్త ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే.



జూన్ 6లోగా ఆ పని పూర్తి చేస్తాం’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. సలహా సంఘం లో సచిన్‌ను తీసుకునే అంశంపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు చాంపియ న్స్ లీగ్ టి20 టోర్నీని మరింత మెరుగ్గా మార్చి అభిమానులకు చేరువ చేసే ఆలోచన ఉందని ఠాకూర్ వెల్లడించారు. ఈ టోర్నీకి ఆశించిన స్పందన రావడం లేదని ఆయన అంగీకరించారు. ‘యూఏఈలో మినీ ఐపీఎల్ అనేది మీడియా సృష్టి మాత్రమే. అయితే సీఎల్‌టి20 విఫలమైందనేది మాత్రం వాస్తవం. తప్పులు సరిదిద్దుకొని కొత్త మార్పులతో వస్తాం. ఆ టోర్నీ జరిగే నెల రోజులను సమర్థంగాఉపయోగించుకుంటాం’ అని ఠాకూర్ పేర్కొన్నారు. మిహ ళా క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామిలకు త్వరలోనే కాంట్రాక్ట్‌లు అందజేస్తామన్నారు. పాక్‌తో సిరీస్‌పై కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని శుక్లా స్పష్టం చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top