భారత ఆటగాళ్ల గదుల్లో సిరంజీలు!

కామన్వెల్త్ క్రీడల్లో మరో వివాదం

అంగీకరించిన చెఫ్ డి మిషన్

విటమిన్ల కోసమేనని వివరణ

బెంగళూరు: కామన్వెల్త్ క్రీడలు ముగిసి దాదాపు పది రోజులయ్యాయి. అయితే ఆటతో పాటు అక్కడ చోటు చేసుకున్న మరో వివాదం తాజాగా బయటపడింది.  వివరాల్లోకెళితే... గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్లు బస చేసిన గదుల్లో సిరంజీలు లభించినట్లు క్రీడాగ్రామం అధికారులు క్రీడల సమయంలోనే బయటపెట్టారు. అదీ ఏకంగా మూడుసార్లు దొరికాయని వారు వెల్లడించారు. అథ్లెట్లకు బస ఏర్పాటు చేసిన గదులను నిర్వహించే హౌస్ కీపింగ్ సిబ్బంది దీనిని బహిర్గతం చేశారు. మొదటిసారి ఒక పారాథ్లెట్ గదిలో సిరంజీలు దొరికాయని వారు అన్నారు.

ఆ తర్వాత లాంజ్‌లో మరికొన్ని పడి ఉన్నాయని, మూడోసారి భారత రెజ్లర్ల గదిలో బయటపడ్డాయని వారు వివరించారు. అయితే మూడు సందర్భాల్లోనూ జట్టు మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించిన నిర్వాహకులు వదిలిపెట్టారు. సిరంజీలు దొరికిన తర్వాత ‘రెగ్యులర్‌గా గదులు తనిఖీ చేస్తాం. మా ఆటగాళ్లకు డోపింగ్‌పై అవగాహన కల్పిస్తాం’ అని రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే ఇది జరిగింది. అంతకుముందే ఆటగాళ్ల కదలికల గురించి సమాచారం ఇవ్వనందుకు కూడా భారత మేనేజ్‌మెంట్ చీవాట్లు పడ్డట్లు తెలిసింది.

క్రీడా గ్రామం ప్రారంభంనుంచి ముగింపు ఉత్సవం వరకు ఆటగాళ్లు వాడే ప్రతీ ఇంజెక్షన్‌ను పరిశీలించాలని 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి నిబంధనలు వచ్చాయి. అయితే గ్లాస్గో అధికారులు వాటిని కఠినంగా అమలు చేయకపోవడంతో భారత ఆటగాళ్లు బయటపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి కామన్‌వెల్త్ క్రీడల నుంచి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని కమిటీ ప్రకటించింది.

అవును... నిజమే!

ఆటగాళ్ల గదుల్లో సిరంజీలు దొరికిన విషయాన్ని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ నిర్ధారించారు. అయితే ఆటగాళ్లు తప్పేమీ చేయలేదని ఆయన అన్నారు. ‘ఇందులో నిబంధనల ఉల్లంఘన జరగలేదు. మల్టీ విటమిన్‌లను తీసుకునేందుకే ఆటగాళ్లు సిరంజీలను ఉపయోగించారు. మెడికల్ కమిషన్ ముందు నేను వాంగ్మూలం ఇచ్చాను. వారు మనకు క్లీన్‌చిట్ కూడా ఇచ్చారు’ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి భారత అధికారుల అరెస్ట్, విడుదల తర్వాత దేశం పరువు పోగొట్టే మరో వివాదం చివరకు సమసిపోవడంతో ఐఓఏ ఊపిరి పీల్చుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Read also in:
Back to Top