'వీవీఎస్ లక్ష్మణ్పై ఆరోపణలు తప్పు'

'వీవీఎస్ లక్ష్మణ్పై ఆరోపణలు తప్పు'


న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే క్రికెట్ టెక్నాలజీ కంపెనీలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇంకా వాటా కొనసాగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వివరణ ఇచ్చింది. కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్ కు వాటాలు ఉన్న కారణంగా అతనిపై  ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కింద చర్య తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని బోర్డు స్పష్టం చేసింది.  ప్రస్తుతం క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడైన లక్ష్మణ్కు కుంబ్లే కంపెనీలో ఎటువంటి షేర్లు లేవని.. దాంతో లక్ష్మణ్ కు 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్'  వర్తించదని తెలిపింది. 


 


'లక్ష్మణ్ కు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్'  వర్తించదు. ఎందుకంటే ఆ కంపెనీ నుంచి లక్ష్మణ్ గతంలోనే వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా తెలియజేశాడు. క్రికెట్ పరిపాలనలో భాగస్వామ్యి అయిన లక్ష్మణ్కు కుంబ్లే 'టెన్విక్' కంపెనీలో ఎటువంటి వాటా లేదు. దాంతో అతను కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కింద చర్యలు చేపట్టే అవకాశమే లేదు' అని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. గతంలో క్రికెట్ టెక్నాలజీ, ప్లేయర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్ ఐదు శాతం షేర్ హోల్డర్ గా ఉన్నాడు. అయితే 2016 మార్చి నెలలో ఆ కంపెనీ  వాటా నుంచి వైదొలిగాడు. అనంతరం ఆ కంపెనీతో ఎటువంటి అధికారికి, అనధికారికి కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడం లేదని బీసీసీఐకి లక్ష్మణ్ తెలిపాడు. కాగా, ఆ కంపెనీతో లక్ష్మణ్ కు ఇంకా ఆ కంపెనీలో ఉన్నందును 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కింద బీసీసీఐ చర్యలు చేపట్టనున్నట్లు వార్తలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top