రజత్‌కు రజతం ఖాయం

రజత్‌కు రజతం ఖాయం


చాంపియాకు ఒలింపిక్ బెర్త్  వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్

 కోపెన్‌హాగెన్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజత్ చౌహాన్ భారత్‌కు కనీసం రజత పతకాన్ని ఖాయం చేశాడు. అలాగే వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మంగల్ సింగ్ చాంపియా ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. గురువారం జరిగిన కాంపౌండ్ విభాగం సెమీఫైనల్లో రజత్ 143-138 తేడాతో కామిలో కార్డోనా (కొలంబియా)ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో మంగల్ సింగ్ 6-2తో ఆరో సీడ్ ఆంటోనియో ఫెర్నాండెజ్ (స్పెయిన్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే క్వార్టర్స్‌లో తను ఎలియాస్ మలవే (వెనెజులా) చేతిలో 4-6తో ఓడి పతకంపై ఆశలు వదులుకున్నాడు. మరోవైపు మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం కోసం జరిగే ప్లేఆఫ్‌లో లక్ష్మీరాణి మజీ.. కొరియాకు చెందిన మిసున్ చోయితో తలపడుతుంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్మీరాణి 8-9 స్వల్ప తేడాతో ఐదో సీడ్ అలెజాండ్రా వాలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి పరాజయం పాలైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top