కాలపరీక్షలో.. 'పసిడి' పరుగు

కాలపరీక్షలో.. 'పసిడి' పరుగు


ముంబై: ఏ కార్యానికైనా సంకల్ప బలం ప్రధానం. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు కొండల్ని సైతం పిండి చేయవచ్చని ఓ అమ్మాయి నిరూపించింది.  మహారాష్ట్రలోని దాదార్ ప్రాంతానికి చెందిన షూ పాలిష్ చేసుకుంటూ జీవనం సాగించే మంగేష్ కుమార్తె సయలీ హయ్ షున్  కాలపరీక్షలో గెలిచి పసిడి సాధించింది.  జిల్లా క్రీడల్లో భాగంగా సోమవారం ప్రియదర్శిని పార్కులో(పీడీపీ) లో జరిగిన ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో సయలీ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.  కనీసం కాళ్లకు షూస్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయి అండర్ -17 విభాగంలో మూడు వేల మీటర్లు పరుగెత్తి తన లక్ష్యంలో తొలి అడుగును దిగ్విజయంగా అధిగమించింది. అయితే ఆ విషయం తెలిసిన తండ్రి మంగేష్ తొలుత నమ్మలేకపోయాడు. తన కూతురు పసిడితో మెరిసిందని ఆ నోట-ఈ నోట విన్న మంగేష్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన కూతురు చాంపియన్ గా నిలవమేడంటూ తన పేదరికాన్ని గుర్తు చేసుకున్నాడు. తనతో చెప్పిన వారు ఆట పట్టిస్తున్నారేమోనని ఓ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు.  కానీ అది వాస్తవం.  తన కూతురు స్వర్ణాన్ని సాధించింది అని ఉద్వేగానికి గురయ్యాడు. అయితే కూతూరు సాధించిన ఆ ఘనతకు చూడటానికి 'ఆకలి కడుపు' అడ్డొచ్చిందని ఆవేదన చెందాడు.



'నా కూతురు స్కూల్ అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొంటుందని తెలుసు.  ఆ ఈవెంట్ ను చూడ్డానికి వెళదామనుకున్నా. ఒకవేళ నేను వెళితే నా కుటుంబ పోషణ భారంగా మారుతుంది.  నేను చూడ్డానికి వెళ్లడం కంటే కుటుంబ పరిస్థితి ముఖ్యం' అని మంగేష్ ఒకింత గర్వంగా కూతురు ఘనతను గుర్తు చేసుకున్నాడు.  తనకు ఇద్దరు కూతుళ్లని, వారిలో పెద్ద కూతురు డిప్లొమోలో ఇన్ ఫర్మమేషన్ టెక్నాలజీ  చేస్తుందన్నాడు. తన కూతుళ్లు ఇరువురూ 'బంగారం' అంటూ మురిసిపోయాడు. తన పిల్లలకు చదువునే కానుకగా ఇవ్వాలనేది తన లక్ష్యమని.. ఆ క్రమంలోనే ఒక్కరోజు కూడా పాలిష్ షాపును మూసివేయనన్నాడు. నెలకు మూడు వేల నుంచి పది వేల రూపాయలకు వరకూ తన సంపాదన ఉంటుందన్నాడు. అసలు డబ్బు తీసుకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని మంగేష్ చెప్పుకొచ్చాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top