మా నిర్ణయాలపై స్వేచ్ఛ: కేఎల్ రాహుల్

మా నిర్ణయాలపై స్వేచ్ఛ: కేఎల్ రాహుల్


బెంగళూరు:భారత క్రికెట్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే ఎంపిక తమలాంటి యువ క్రికెటర్లకు ఎంతగానో లాభిస్తుందని కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఒక సలహాదారుడిగా, మరొకవైపు కోచ్గా కుంబ్లే తమతో ఉండటం భారత్ జట్టు మరింత ముందుకు వెళ్లడానికి  దోహదపడుతుందన్నాడు. అతని క్రికెట్ కెరీర్ అనుభవం తమతో షేర్ చేసుకునే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. నగరంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో కుంబ్లే సమక్షంలో త్వరలో వెస్టిండీస్ కు పయనమయ్యే భారత జట్టు ప్రాక్టీస్ ఆరంభించింది. దీనిలో భాగంగా విండీస్ టూర్లో సభ్యుడైన కేఎల్ రాహుల్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు.


 


'కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాడి సేవలు టీమిండియాకు లాభిస్తాయి. ప్రత్యేకంగా మా లాంటి యువ క్రికెటర్లు కుంబ్లే నుంచి చాలా నేర్చుకునే అవకాశం దక్కుతుంది. నిన్నటి ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కుంబ్లేను కలిసిన కొన్ని సందర్భాల్లోనే అతను మాతో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా సభ్యులకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కుంబ్లే కల్పిస్తున్నాడు. అందుకు చాలా ఆనందంగా ఉంది.  క్లిష్ట సమయాల్లో తప్పా, మిగిలిన సందర్భాల్లో మా నిర్ణయాలను మమ్ముల్నే తీసుకోమంటున్నారు. ఇది జట్టు సభ్యులు స్వేచ్ఛ రాణించడానికి ఉపయోగపడుతుంది. అని కేఎల్ రాహుల్ తెలిపాడు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top