2 బంతుల్లో 2 సిక్సర్లు

2 బంతుల్లో 2 సిక్సర్లు


- పెర్త్‌ను గెలిపించిన మార్ష్

- 6 వికెట్లతో డాల్ఫిన్స్ ఓటమి

మొహాలి: పెర్త్ స్కార్చర్స్ విజయలక్ష్యం 165 పరుగులు... గెలుపు కోసం చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. ఫ్రైలింక్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఇక మిగిలిన 2 బంతుల్లో 12 పరుగులు చేస్తేనే విజయం దక్కుతుంది. సాధారణంగా చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు టి20ల్లో చాలా కనిపిస్తాయి. కానీ ఇన్నింగ్స్ చివరి 2 బంతులకు సిక్సర్లతో విజయాన్నందించడం విశేషమేనని చెప్పాలి. క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ దానిని చేసి చూపించాడు. రెండు లో ఫుల్‌టాస్ బంతులను భారీ సిక్సర్లుగా మలిచి డాల్ఫిన్స్‌ను ముంచాడు. ఫలితంగా ఇక్కడి పీసీఏ మైదానంలో శనివారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో స్కార్చర్స్ 6 వికెట్ల తేడాతో డాల్ఫిన్స్‌పై విజయం సాధించింది.



టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఖాయా జోండో (50 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేశవ్ మహరాజ్ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పెర్త్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సిమన్స్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వైట్‌మన్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top