ట్రైసిరీస్ కు మైకేల్ క్లార్క్ అనుమానం!


హరారే: మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ట్రై సిరీస్ కు ఆస్టేలియన్ ఓపెనర్ మైకేల్ క్లార్క్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. శనివారం నాటి ప్రాక్టీస్ సెషన్ లో క్లార్క్ కు గాయం కావడంతో అతను ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉంది.  ఈ ట్రై సిరీస్ లో జింబాబ్వే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా జట్టు వచ్చీ రావడంతోనే ప్రాక్టీస్ ఆరంభించినా.. క్లార్క్ కు గాయం మాత్రం ఆ జట్టును కలిచివేస్తుంది.ఒకవేళ ఈ సిరీస్ కు క్లార్క్ దూరమైతే అది కచ్చితంగా జట్టు ఆటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.


 


'శనివారం ప్రాక్టీస్ సెషన్ లో క్లార్క్ ఎడమచేతికి గాయమైంది. ప్రస్తుతం ఆ గాయం అతన్ని బాధిస్తోంది. ఆ గాయానికి సంబంధించి మరో 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము'అని జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top