గేల్ కు రెండు 'లైఫ్'లు ఇచ్చినా..
పెర్త్: విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ లైఫ్ ఇచ్చాడు. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ ఇచ్చి క్యాచ్ ను ఉమేష్ వదిలేశాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో గేల్ కొట్టిన షాట్ కు బంతి బౌండరీ దాటేట్టు కనబడింది. అయితే పరిగెత్తుకుంటు వచ్చినా ఉమేష్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. బంతిని పట్టుకుని కిందపడిపోయాడు. అతడు కిందపడిన తర్వాత చేతిలోని బంతి జారిపడింది. దీంతో గేల్ బతికి పోయాడు.
6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ బౌలింగ్ లో ఇచ్చిన మరో క్యాచ్ ను పట్టుకునేందుకు షమీ విఫలయత్నం చేశాడు. దీంతో గేల్ ను రెండు లైఫ్ లు లభించాయి. ఆరంభం నుంచి ఇబ్బందిగా కదిలినా ఈ విధ్వంసకర ఆటగాడు 21 పరుగుల స్వల్ప స్కోరుకు పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్'లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. షమీ బౌలింగ్ లో మొహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓవరాల్ గా 270 పరుగులతో పరుగులవీరుల పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.