క్రిస్ గేల్(21) అవుట్
పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ 35 పరుగులకే 4 వికెట్లు నష్టపోయింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ టాప్ కుప్పకూలింది. రామదిన్(0) నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. క్రిస్ గేల్(21) మూడో వికెట్ గా అవుటయ్యాడు. శామ్యూల్స్(0) రనౌటయ్యాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్(6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.