బ్లూస్‌ను గెలిపించిన చంద్రశేఖర్


ఎ-డివిజన్ వన్డే లీగ్

 సాక్షి, హైదరాబాద్: చంద్రశేఖర్ (7/35) నిప్పులు చెరగడంతో డెక్కన్ బ్లూస్ 64 పరుగుల తేడాతో ఎస్.రేమండ్స్‌పై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ బ్లూస్ 236 పరుగులు చేసి ఆలౌటైంది. శేషగిరి 46, శ్రీకాంత్ 35 పరుగులు చేశారు. రేమండ్స్ బౌలర్ తేజోధర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్.రేమండ్స్ జట్టు 172 పరుగుల వద్ద ఆలౌటైంది. వికాస్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

 

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

 విజయ్‌నగర్: 220 (కమల్ 31, నర్సింహా 30; గణేశ్ 6/63), స్పోర్టీవ్: 221/8 (రోషన్ 70, ధీరజ్ 48; సతీశ్ 4/53)

 

 యాదవ్ డెయిరీ: 242 (శ్రీనివాస్ 53, సూర్యతేజ 53; ప్రణవ్ 4/87), డెక్కన్ కోల్ట్స్: 174 (రమేశ్ 47, అర్జున్ 44; రిషబ్ 5/35)

 

  శాంతి ఎలెవన్: 146 (జగన్ 47 నాటౌట్; సుశిక్షిత్ 5/37), భరత్: 147/4 (రోహిత్ దివేశ్ 52)

 సెయింట్ ప్యాట్రిక్స్: 229 (నిఖిల్ 40 నాటౌట్, శ్రీమాన్ 37; నీరజ్ 5/48), ఎం.ఎల్.జయసింహా: 189 (వినయ్ 55, సాత్యకి 3/40)

 

 ఎంపీ బ్లూస్: 236 (యేసుదాస్ 77 నాటౌట్; కశ్యప్ 4/64), మాంచెస్టర్: 178 (సొహైల్ ఖాన్ 47 నాటౌట్; సతీశ్ 4/58)

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top