భజరంగ్ ‘రజత' పట్టు

భజరంగ్ ‘రజత' పట్టు


ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ భజరంగ్ రజతం గెలవగా, నర్సింగ్ యాదవ్ కాంస్యం సాధించి ఘనంగా ముగింపు పలికారు. పురుషుల 61 కేజీల ఫైనల్లో భజరంగ్ 1-3తో మసూద్ మహ్మద్ (ఇరాన్) చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు సెమీస్‌లో భజరంగ్ 3-1తో తకసుకా నోరియూకి (జపాన్)పై; క్వార్టర్స్‌లో 4-1తో ఉస్మాన్‌జోడా ఫర్కోడి (తజకిస్థాన్)పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

  పురుషుల 74 కేజీల కాంస్య పతక పోరులో పంచమ్ నర్సింగ్ యాదవ్ 3-1తో డైసుక్ షిమాడా (జపాన్)పై నెగ్గాడు. రెప్‌చేజ్ రౌండ్‌లో నర్సింగ్ 4-1తో రంజాన్ కంబరోవ్ (తుర్క్‌మెనిస్థాన్)పై నెగ్గి కాంస్యం పోరుకు అర్హత సాధించాడు.

  86 కేజీల రెప్‌చేజ్ రౌండ్‌లో మాత్రం పవన్ కుమార్ నిరాశపర్చాడు. 1-4తో జాంగ్ ఫెంగ్ (చైనా) చేతిలో ఓడాడు.




 క్వార్టర్స్‌లో వికాస్ క్రిషన్

 బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ బౌట్లలో బరిలోకి దిగిన ముగ్గురు బాక్సర్లు నిరాశపరిచారు. అయితే పురుషుల మిడిల్ 75కేజీ విభాగంలో వికాస్ క్రిషన్ క్వార్టర్స్ చేరి పతకంపై ఆశలు పెంచాడు. తను ప్రిక్వార్టర్స్‌లో 3-0తో అజామత్ ఉలు (కిర్గిస్థాన్)ను ఓడించాడు. సెమీస్‌లో చోటు కోసం తను నొర్మతోవ్ (ఉజె ్బకిస్థాన్)ను ఢీకొంటాడు.

  ఇక పురుషుల ఫ్లయ్ 52కేజీ విభాగం క్వార్టర్స్‌లో గౌరవ్ బిదురి ... వెల్టర్ 69కేజీ విభాగం క్వార్టర్స్‌లో మన్‌దీప్ జంగ్రా... లైట్ హెవీ 81కేజీ క్వార్టర్స్‌లో కుల్దీప్ సింగ్ తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు.




 హాకీ: సెమీస్‌లో ఓడిన మహిళలు

 మహిళల హాకీ సెమీఫైనల్లో భారత్ 1-3 చేతిలో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. మూడో నిమిషంలోనే కొరియా తొలి గోల్‌తో దూసుకెళ్లగా 11వ నిమిషంలో నమిత టొప్పో భారత్ తరఫున ఏకైక గోల్ సాధించింది. కాంస్యం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.. జపాన్‌ను ఎదుర్కొంటుంది.  భారత పురుషుల హాకీ జట్టు నేడు (మంగళవారం) జరిగే సెమీఫైనల్లో పటిష్ట దక్షిణ కొరియాను ఢీకొంటుంది.

 కబడ్డీ: ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’ ప్రిలిమినరీ రౌండ్‌లో థాయ్‌లాండ్‌ను 66-27తేడాతో ఓడించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు (మంగళవారం) పాకిస్థాన్‌తో ఆడుతుంది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top