ఆసీస్‌దే వన్డే సిరీస్

ఆసీస్‌దే వన్డే సిరీస్ - Sakshi


చివరి మ్యాచ్‌లోనూ ఓడిన దక్షిణాఫ్రికా



 సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 281 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు పదో ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 275 పరుగులుగా నిర్దేశించారు.



షేన్ వాట్సన్ (93 బంతుల్లో 82; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), ఓపెనర్ ఆరోన్ ఫించ్ (67 బంతుల్లో 76; 11 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (74 బంతుల్లో 67; 6 ఫోర్లు; 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 280 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఓపెనర్ డికాక్ (123 బంతుల్లో 107; 14 ఫోర్లు) వన్డేల్లో ఆరో సెంచరీ సాధించాడు. బెహర్డిన్ ( 63; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు.

 

 వన్డేల్లో టాప్‌కు చేరిన ఆసీస్

 దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో గెలుచుకోవడంతో ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకుంది. ప్రస్తుతం భారత్‌తో సమానంగా 117 పాయింట్లతో ఉన్నా... 0.2 దశాంశమానం తేడాతో ఆసీస్ ముందంజలో ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top