ఐదు ఓవర్లలో ఆసీస్ స్కోరు 48/1
ఆక్లాండ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆసీస్ ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(21), షేన్ వాట్సన్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా 30 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ వికెట్ ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ దూకుడుగా ఆడే క్రమంలో ఫించ్(14)ను తొలి వికెట్ రూపంలోనష్టపోయింది.