ఎదురీదుతున్న ఆసీస్

ఎదురీదుతున్న ఆసీస్


బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదుతోంది.  తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే ఆటతీరును కొనసాగిస్తోంది.  ఆసీస్ రెండో రోజే తన  రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించినా.. 28 .3 ఓవర్లు ముగిసే సరికి 111 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(77) మినహా ఆసీస్ మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పూర్తిగా చతికిలబడ్డారు.  ఆసీస్ ఆటగాళ్లలో రోజర్స్ (6), స్టీవ్ స్మిత్ (8), క్లార్క్(3), వోజస్(0), మిచెల్ మార్ష్(6) లు ఘోరంగా విఫలమైయ్యారు. ప్రస్తుతం నేవిల్(16), జాన్సన్(10) లు క్రీజ్ లు ఉన్నారు.  40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.


 


తొలి ఇన్నింగ్స్ లో అండర్సన్ ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా,  రెండో ఇన్నింగ్స్ లో ఆ బాధ్యతను ఫిన్ తీసుకున్నాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు వికెట్లు ఫిన్ చేజిక్కించుకున్నాడు.  అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 281 పరుగులకు ఆలౌటైంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఇంగ్లండ్ గెలిచే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.



ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 136 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 281 ఆలౌట్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top