చాంప్స్ సుప్రీత, మౌనిక

చాంప్స్ సుప్రీత, మౌనిక - Sakshi


ఆసియా స్కూల్ చెస్

సాక్షి, హైదరాబాద్: చైనీస్ తైపీలో జరిగిన ఆసియా స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు మెరిశారు. రెండు స్వర్ణాలు, కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు సాధించారు. అండర్-13 విభాగంలో పొట్లూరి సుప్రీత... అండర్-11 విభాగంలో బొమ్మిని మౌనిక అక్షయ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్-9 విభాగంలో చిన్నం వైష్ణవి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కెరీర్‌లో నాలుగో అంతర్జాతీయ పతకాన్ని నెగ్గిన సుప్రీతకు తాజా ప్రదర్శనతో ‘ఉమెన్ ఫిడే మాస్టర్’ హోదా లభించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top