ఆసియా కప్లో 85 ఏళ్ల రికార్డు బద్దలు
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ కప్ 2005లో 85 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఆసియా కప్లో డ్రా లేకుండా వరుసగా 20 మ్యాచ్లు జరిగాయి. మేజర్ ఫుట్బాల్ టోర్నీల్లో డ్రా కాకుండా వరుసగా అత్యధిక మ్యాచ్లలో ఫలితాలు వెలువడిన రికార్డు ఆసియా కప్ సొంతం చేసుకుంది.
1930 ఫిఫా వరల్డ్ కప్లో డ్రా ఎదురుకాకుండా వరుసగా 18 మ్యాచ్లు జరిగాయి. తాజాగా ఆసియా కప్లో 20 మ్యాచ్లు జరగడంతో ఈ రికార్డు కనుమరుగైంది.