ఆసీస్ హ్యాట్రిక్

ఆసీస్ హ్యాట్రిక్


ఫ్లాష్‌బ్యాక్ 2007

ఈ ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగించింది. వెస్టిండీస్‌లో జరిగిన ఈ మెగాఈవెంట్‌లోనూ నెగ్గి వరుసగా మూడు ప్రపంచకప్‌లు సాధించిన కంగారూలు హ్యాట్రిక్ నమోదు చేశారు. అప్పటివరకు జరిగిన 9 టోర్నీల్లో ఇది ఆసీస్‌కు నాలుగో కప్ కావడం  విశేషం. కరీబియన్ దీవుల్లో జరిగిన ఈ టోర్నీలో పలు సంచలనాలు నమోదయ్యాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి.



దీంతో తర్వాత జరిగిన సూపర్-8, నాకౌట్ మ్యాచ్‌లకు పెద్దగా ఆదరణ లభించలేదు. అలాగే ఫైనల్లో చీకటి పడ్డా మ్యాచ్‌ను నడిపించి శ్రీలంక ఓడిపోవడానికి ఐసీసీ అంపైర్లు కారణమయ్యారనే వివాదం జరిగింది. టోర్నీ జరుగుతున్న సమయంలోనే పాక్ కోచ్ వూమర్‌ను హోటల్ గదిలో హత్య చేశారు. మొత్తం మీద ఐసీసీ ప్రపంచకప్ ఫార్మాట్ గురించి పునఃసమీక్ష జరపాల్సిన విధంగా ఈ టోర్నీ సాగింది. ఆట పరంగా మాత్రం ఆస్ట్రేలియా ఎక్కడా తడబాటు లేకుండా జయకేతనం ఎగరవేసింది.

 

ఆతిథ్యం: వెస్టిండీస్, వేదికలు: 8


పాల్గొన్న జట్లు (16): భారత్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్, బెర్ముడా, కెనడా, నెదర్ల్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top