సచిన్ అడుగు జాడల్లో అర్జున్ టెండూల్కర్!
ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అడుగు జాడల్లోనే ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. వర్లీ క్రికెట్ క్లబ్ తరపున అర్జున్ టెండూల్కర్ నవంబర్ నుంచి 15 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాడు. అండర్ 18 జట్టుకు అర్జున్ టెండూల్కర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 1988, 1989 సంవత్సరంలో స్టార్ క్రికెట్ క్లబ్ తరపున ఇంగ్లండ్ లో పర్యటించిన సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎంపికయ్యారు.
వర్లీ క్రికెట్ క్లబ్ యజమాని అవినాష్ కదమ్ ఈ టూర్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం దక్షిణాఫ్రికా పర్యటనలో అర్జున్ టెండూల్కర్ అద్బుతంగా రాణించిన విషయాన్ని అవినాష్ గుర్తు చేశారు. ఆ పర్యటనలో అర్జున్ అత్యధిక పరుగులు సాధించారని ఆయన తెలిపారు. సచిన్ టెండూల్కర్ లానే అర్జున్ చురుకైన క్రికెటర్ గా రాణిస్తాడని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా వర్లీ క్రికెట్ క్లబ్ కు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అవినాష్ కదమ్ వెల్లడించారు.