అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం!

అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం!


దుబాయ్: భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కు అరుదైన గౌరవ దక్కనుంది. త్వరలో ఈ మాజీ లెగ్ స్పిన్నర్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్  లో సభ్యత్వం స్వీకరించనున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఆదివారం జరుగనున్న టీమిండియా -దక్షిణాఫ్రికా ల మ్యాచ్ అనంతరం కుంబ్లే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యత్వం లభించనుంది. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 77 కు చేరనుంది. అంతకుముందు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత్ నుంచి చోటు దక్కిన వారిలో బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు ఉన్నారు.


 


ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనిల్ కు గత రికార్డుల ఆధారంగా ఈ గౌరవాన్ని ఇవ్వనున్నారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్ గా కుంబ్లే రికార్డు సాధించి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు 1999వ సంవత్సరంలో న్యూఢిల్లీలో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. అనిల్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top