ఆమ్లా, డుప్లెసిస్ (బి) క్రిస్ గేల్


సిడ్నీ: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ బంతితో మెరిశాడు. గేలో్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. అందులోనూ గేల్ అవుట్ చేసింది సాదాసీదా బ్యాట్స్మెన్ను కాదు.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఆమ్లా, డుప్లెసిస్లను. హాఫ్ సెంచరీలు చేసి క్రీజులో కుదురుకున్నఆమ్లా (65), డుప్లెసిస్ (62) జోడీని పెవిలియన్ చేర్చాడు. గేల్ బౌలింగ్లో డుప్లెసిస్ క్యాచ్ అవుటవగా, ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు.



అంతకుముందు సఫారీలు 145/1 స్కోరుతో దూసుకుపోతున్నారు. ఆమ్లా, డుప్లెసిస్ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు. గేల్ పరుగు తేడాతో ఈ జోడీని అవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో 182/3 స్కోరు చేసింది. డివిల్లీర్స్, రోసోవ్ బ్యాటింగ్ చేస్తున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top