Alexa
YSR
‘ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటా’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

యువీ దూకుడు: రాయుడు శతకం

Others | Updated: January 10, 2017 16:33 (IST)
యువీ దూకుడు: రాయుడు శతకం
ముంబై: గత కొంతకాలం భారత జాతీయ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు సత్తా చాటుకున్నాడు.  ఇంగ్లండ్తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ వార్మప్ మ్యాచ్లో రాయుడు శతకం సాధించాడు. రాయుడు  97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆద్యంతం అత్యంత నిలకడ ప్రదర్శించిన రాయుడు తన పూర్వవైభవాన్ని చాటుకున్నాడు. అతనికి జతగా యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. యువీ 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు.  క్రీజ్లోకి వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించిన యువీ కచ్చితమైన షాట్లతో అభిమానుల్ని అలరించాడు. అంతకుముందు శిఖర్ ధవన్(63) రెండో వికెట్ గా వెనుదిరిగగా, తొలి వికెట్ గా మన్ దీప్ సింగ్(8) పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ -ఎ జట్టు ఆదిలోనే మన్ దీప్ వికెట్ ను నష్టపోయింది. అనంతరం శిఖర్ ధవన్ తో కలిసి రాయుడు ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి రెండో వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. అనంతరం రాయుడు-యువీలు ఇన్నింగ్స్ ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే యువీ తొలుత హాఫ్ సెంచరీ చేయగా, ఆపై స్వల్ప వ్యవధిలో రాయుడు శతకం సాధించాడు.అయితే రాయుడు రిటైర్డ్  అవుట్ గా  పెవిలియన్ చేరగా, ధోని క్రీజ్లోకి వచ్చాడు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మిరప మంటలెందుకు?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC