విండీస్ అంటే అశ్విన్కు పూనకం..

విండీస్ అంటే అశ్విన్కు పూనకం..


నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్తో సిరీస్ ప్రారంభానికి ముందు పిచ్లు చాలా స్లో, బంతి చాలా నెమ్మదిగా వస్తుంది. టాపార్డర్ ఎలా ఆడుతుందో, మిడిలార్డర్ ఓపికగా ఆడుతుందా లేదా అని ఎన్నో విషయాల గురించి ఆలోచించారు. కానీ విండీస్తో ఆంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో రెండురోజులు భారత్ పైచేయి సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే రవీంద్ర జడేజాను పక్కనబెట్టి రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోవడం సత్ఫలితాన్ని ఇచ్చింది. గతంలో స్వదేశంలో విండీస్ పై సెంచరీలు చేసిన అశ్విన్ ఇప్పుడు కరీబియన్ గడ్డపైనా తన మార్క్ చూపించాడు.



గతంలో భారత్ లో.. ఇప్పుడు వారి గడ్డపై..

విండీస్ అంటే చాలు అశ్విన్కు పూనకం వస్తుంది. గతంలో అతడు చేసింది రెండు సెంచరీలు కాగా, ఆ రెండింటిని విండీస్ పైనే సాధించాడు. ఈ మ్యాచ్లోనూ ఆల్ రౌండర్ అశ్విన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించి సెంచరీ (253 బంతుల్లో 113 ; 12 ఫోర్లు) చేశాడు. టెస్టుల్లో ఇది అశ్విన్ మూడో సెంచరీ. దీంతో అతడు చేసిన మూడు టెస్టు సెంచరీలు విండీస్పైనే చేసి కరీబియన్లపై తన ఆట చాలా ప్రత్యేకమని నిరూపించాడు. గతంలో 2011లో ముంబై టెస్టులో  సెంచరీ(103), 2013 నవంబర్లో కోల్ కతా టెస్టులో సెంచరీ (124) చేశాడు. ఇప్పుడు వారిగడ్డపై కూడా మరో సెంచరీ నమోదుచేశాడు. సెంచరీ ఇచ్చిన స్ఫూర్తితో అశ్విన్ బౌలింగ్లోనూ చెలరేగి మంచి ఫలితాలను రాబట్టే అవకాశాలున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top