ఆఫ్రిది మరో ఘనత

ఆఫ్రిది మరో ఘనత - Sakshi


నెపియర్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేల్లో మరో ఘనత సాధించాడు. 8 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా బుధవారం యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు.



వ్యక్తిగత స్కోరు 2 పరుగులు చేయగానే 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు 394 వన్డేలు ఆడిన ఆఫ్రిది 8019 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఇప్పటివరకు ఆఫ్రిది 393 వికెట్లు పడగొట్టాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top