అఫ్ఘాన్ను ఓ ఆటాడుకున్నారు


పెర్త్ : ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అప్ఘానిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా అప్ఘాన్ తో బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. ప్రపంచ కప్లో ఆసీస్ కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం.



డేవిడ్ వార్నర్ (133 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 178) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వార్నర్..  స్టీవెన్ స్మిత్ (95)తో కలసి 260 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో మ్యాక్స్వెల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్ఘాన్ బౌలర్లు షాపూర్, దావ్లత్ చెరో రెండు వికెట్లు తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top