డీఆర్ఎస్ ఉంది.. టీవీ అంపైర్లు లేరు!

డీఆర్ఎస్ ఉంది.. టీవీ అంపైర్లు లేరు!


టాన్టాన్: ప్రపంచ మహిళా క్రికెట్ లో సమస్యలు ఉన్నాయనడానికి తాజాగా ఘటనే అద్దం పడుతోంది. మహిళల ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ల మధ్య జరిగిన మ్యాచ్లో థర్డ్ అంపైర్ లేకుండానే మ్యాచ్ జరిగింది. అది కూడా మహిళల క్రికెట్ లో  అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టిన తరువాత థర్డ్ అంపైర్ లేకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి లోనుచేసింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదటి వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో చెడియన్ నేషన్ స్క్వేర్ లెగ్ వైపు ఆడారు.


దానిలో భాగంగానే తొలి పరుగును విజయవంతంగా ప్రయోగించి రెండో పరుగు కోసం యత్నించారు. ఈ క్రమంలోనే ఆమె పరుగు పూర్తి చేయకుండానే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెయిల్స్ పడగొట్టి అవుట్ కోసం అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ క్యాథీ క్రాస్ తిరస్కరించారు. అయితే అది అవుటా?కాదా నిర్దారించడానికి టీవీ అంపైర్(థర్డ్ అంపైర్) లేరు. దాంతో చెడియన్ కు లైఫ్ లభించినట్లయ్యింది. ఈ అవుట్ ను తరువాత రిప్లేలో చూస్తే ఆమె క్రీజ్లోకి వచ్చేలోపే బెయిల్స్ పడినట్లు తేలింది.


కాగా, ఇక్కడ థర్డ్ అంపైర్ అనేవారు ఎవరూ లేకపోవడం వల్లే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఏమిటంటే.. ఆ మ్యాచ్ కేవలం ఆన్ లైన్లో మాత్రమే ప్రసారమయ్యింది కానీ టీవీలో కాదు. కేవలం టీవీల్లో ప్రసారమయ్యే మ్యాచ్ లకు మాత్రమే థర్డ్ అంపైర్లను ఐసీసీ నియమించింది. ఇలా ఆన్ లైన్ వచ్చే మ్యాచ్లకు థర్డ్ అంపైర్ అవసరం లేదనేది ఐసీసీ అభిప్రాయంగా ఉంది. మహిళల ప్రపంచకప్ లో దాదాపు ఎక్కువ శాతం మ్యాచ్లు ఆన్ లైన్ ప్రసారమవుతుండగా, టెలివిజన్ లో పది మ్యాచ్లు మాత్రమే టెలికాస్ట్ అవుతున్నాయి. అంటే మరి మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ను ఐసీసీ ప్రవేశపెట్టి ఉపయోగం ఏమిటో ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో ఇలా జరగడంపై క్రికెట్ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top