రికార్డులే రికార్డులు..

రికార్డులే రికార్డులు..


వన్డే ప్రపంచకప్-2015 పోరులో లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 22 మ్యాచ్ లు క్రికెట్ ప్రేమికులను అలరించాయి. అరివీర భయంకర ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్టు చెలరేగుతుండడంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజా వరల్డ్ కప్ లో నమోదైన రికార్డులు...


  • చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై తొలి మ్యాచ్ లోనే భారత్ నెగ్గి ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాక్ పై ఓటమి చెందని రికార్డును పదిలంగా నిలుపుకుంది.

  • భారత్ ఆడిన రెండో మ్యాచ్ లో ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా పై గెలవని చెత్తరికార్డును తిరగరాస్తూ భారీ విజయాన్ని నమోదు చేసింది.

  • వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించి వరల్డ్ కప్ లో తొలి వ్యక్తిగత డబుల్ సెంచరీ(215)ని సాధించాడు. అంతేకాదు వరల్డ్ కప్ లో  ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

  • ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో.. వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డుని మెక్ కల్లం(18 బంతుల్లో చేసి) తన పేరిట నమోదు చేశాడు.

  • ఇప్పటివరకు టెండుల్కర్, ద్రావిడ్ పేరిట ఉన్న 331 రికార్డు భాగస్వామ్యాన్ని గేల్, శామ్యూల్య్ 372 పరుగుల భాగస్వామ్యంతో తిరగరాశారు.

  • యూఏఈ తరఫున అన్వర్ తొలి వ్యక్తిగత సెంచరీని నమోదు చేశాడు.

  • విండీస్ తో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్ లో వేగంగా 150 పరుగులు చేసి, అప్పటి వరకు వన్డేల్లో ఉన్న రికార్డుని డివిలియర్స్  తన పేరిట నమోదు చేశాడు.

  • ఇప్పటి వరకు జరిగిన అన్ని వరల్డ్ కప్(50ఓవర్ల మ్యాచ్) లలో  విండీస్ కెప్టెన్ హోల్డర్ 10 ఓవర్లలో అత్యధిక పరుగులు సమర్పించిన చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేశాడు.

  • వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఒక పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయిన అత్యంత చెత్త రికార్డుని మూటగట్టుకుంది.

  • గత వరల్డ్ కప్ పైనల్ తర్వాత భారత్ లో అత్యధికులు వీక్షించిన ఈవెంట్ గా ఫ్రిబ్రవరి 15న జరిగిన భారత్-పాక్ మ్యాచ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ ని 28కోట్ల మంది భారతీయులు వీక్షించినట్టు వరల్డ్ కప్ బ్రాడ్ కాస్టర్ స్టార్ తెలిపింది.

  •  

  • ఐర్లాండ్, వెస్టిండీస్ పై 305 పరుగుల లక్ష్యాన్ని చేధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top