హెచ్‌సీఏ లీగ్‌లో 11 ఏళ్ల విరాట్

హెచ్‌సీఏ లీగ్‌లో  11 ఏళ్ల విరాట్


సాక్షి, హైదరాబాద్ : కొరమటి విరాట్ కార్తికేయ వయస్సు 11 ఏళ్లు. అయితే ‘పిట్టకొంచెం కూత ఘనం’ అన్నట్లు... రంజీ క్రికెటర్లు ఆడే ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆడుతున్నాడు. ఏఓసీతో తలపడుతున్న ఇండియా సిమెంట్స్ జట్టు తరఫున ఈ సీజన్ తొలి మ్యాచ్ బరిలోకి దిగాడు. దీంతో ఎడం చేతి వాటం బ్యాట్స్‌మెన్ విరాట్ మూడు రోజుల లీగ్ ఆడిన అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ అయిన అతను ‘ఇన్ స్పోర్ట్స్’ క్రికెట్ క్లబ్‌లో కోచ్ సయ్యద్ మిరాజ్ శిక్షణలో రాటుదేలాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top